టీ.డబ్ల్యు.ఆర్ బైబిల్ క్విజ్ అనగా ఏమిటి?

ఆ వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

టీ.డబ్ల్యు.ఆర్ బైబిల్ క్విజ్, భారతీయ భాషలలో లోతైన బైబిల్ అధ్యయనం చేయడానికి ప్రోత్సహిస్తూ, ఆసక్తిని పెంపొందిస్తుంది. గత 11 సంవత్సరాలుగా ఈ బైబిల్ క్విజ్ ను ఎంతో జయప్రదంగా మేము నిర్వహించడం జరిగింది. ఈ విజయానికి మూల కారణం, త్రూ ద బైబిల్ (టీ.టీ.బి) కు సంబందించిన డా. జే. వర్నన్ మెక్ గీ గారిచే అభివృద్ధి పరచబడిన, క్రమబద్ధమైన దేవుని వాక్య అధ్యయనానికే ఆపాదించబడుతుంది మరియు ఇది 100 మరియు అంతకంటే ఎక్కువ భాషలలో, టీ.డబ్ల్యు.ఆర్ ఇండియా యొద్ద లభ్యమవుతాయి. టీ.డబ్ల్యు.ఆర్ బైబిల్ క్విజ్ లో పాల్గొనిన ప్రతి సంఘము కూడా, ఈ విధంగా ఇంత లోతైన మరియు విలువైన పద్దతిలో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ఖచ్చితంగా ఇది ఒక విశిష్టమైన అనుభవమని సాక్ష్యమివ్వడం జరిగింది. వాస్తవానికి 2019లో దేశ వ్యాపితంగా, భారత దేశంలో క్విజ్ లో పాల్గొనిన వారి సంఖ్య ఎంతో వేగంగా 66000 కంటే ఎక్కువకు చేరుకుంది.

ఈ సంవత్సరం, ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఇతర దేశాల్లో యున్న ప్రవాస భారతీయులకు కూడా చేరుకునే విధంగా మరొక మెట్టు ఎక్కడానికి ఆలోచన కలిగియుంటున్నాము. ఈ ఆలోచనతో పుట్టిందే, ఈ "ఆన్ లైన్ బైబిల్ క్విజ్" తలంపు. ప్రస్తుతమున్నటువంటి కోవిడ్-19 (కరోనా) మహమ్మారి యొక్క పరిస్థితి దృష్ట్యా, మా ఉద్దేశ్యాలకు సంబంధించి ఈ ప్రయత్నము అనుకూలంగా ఉండటంచేత, ప్రభుత్వం యొక్క నివారణ నిబంధనలకు మరియు చట్ట పరిధిలకు కట్టుబడియుంటూ, పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయాసపడుచున్నాము.

ఈ సంవత్సరం జరగబోయే బృహత్తర కార్యక్రమంలో పాల్గొని, గొప్ప అద్భుతమైన అనుభవాన్ని పొందుకుంటారని మేము ఆశిస్తున్నాం మరియు ఈ సంవత్సరం 'నిర్గమకాండం' ప్రయాణంలో మాతో పాటు కలసి ప్రయాణిస్తూ, మిమ్మును మీరు ఆధ్యాత్మికంగా పుష్టి నొంది, బలపరచబడగలరని భావిస్తున్నాం. మీ పాలిపంపు ఇక ముందు సువార్తను ప్రకటించే విషయంలో మమ్మును ప్రోత్సహించేదిగా ఉంటుంది మరియు దేశంలోని విశ్వాసులను బలపరచేదిగాను ఉంటుంది. తద్వారా టీ.డబ్ల్యు.ఆర్ ఇండియా పరిచర్యను ఆదరించినవారవుతారు.

మీకు ధన్యవాదములు

అందుబాటులో ఉన్న భాషలు :-

టీ.డబ్ల్యు.ఆర్ బైబిల్ క్విజ్ 14 భాషలలో ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంచబడి ఉంటున్నాయి. తద్వారా భారత దేశంలో గుర్తింపును కలిగిన, ఆ యా అనేక భాషలను మాట్లాడే ప్రజలను చేరుకోగలుగుతాము.

English

हिन्दी

தமிழ்

తెలుగు

മലയാളം

বাংলা

मराठी

ਪੰਜਾਬੀ

ગુજરાતી

ಕನ್ನಡ

অসমীয়া

नेपाली

ଓଡ଼ିଆ

Kokborok


ఒకవేళ మీరు ఈ భాషలలొ ఏదైన ఒక దానిని చక్కగా చదవి అర్దము చేసుకోగలిగినట్లయితే, మీరు క్విజ్ లొ ఎటువంటి ఇబ్బంది లేకుండా పాల్గొనవచ్చు. మీరు మీ పేర్లు నమోదు చేసుకునేటప్పుడు, మీరు ఏ భాషలో పట్టు కలిగియుంటారో, ఆ భాషనే ఎంపిక చేసుకోవాలి.

నమోదు రుసుము :-

ఒక్కసారికి మాత్రమే చెల్లించవలసిన నమోదు రుసుము, 50/- రూపాయలు.

మీ పేర్లను క్విజ్ కొరకు నమోదు చేసుకునేటప్పుడే, మీ నమోదు రుసుమును ఆన్ లైన్ ద్వారా చెల్లించాలి.

ఒకవేళ మీరు భారత దేశం అవతల అనగా విదేశాలలో యుండి, నమోదు రుసుము చెల్లించాలనుకుంటున్నట్లైతే, దయచేసి గమనించండి, మీరు భారతీయ నగదు (డబ్బు) రూపంలో మాత్రమే చెల్లించవలసి యుంటుంది. ఒకవేళ ఈ చెల్లింపు విషయానికి సంబంధించి, మీరు ఏదైనా సమస్య ఎదుర్కుంటున్నట్లైతే, దయచేసి ఈ వెబ్ సైట్ లో పేర్కొనబడిన విధంగా, సంప్రదించవలసిన జాబితాలో ఎవరినైనా మీరు నిస్సంకోచంగా సంప్రదించవచ్చు.

ఒక్కసారి మీ నమోదు ప్రక్రియ ముగించబడి, టీ.డబ్ల్యు.ఆర్ ఇండియాచే నిర్ధారించబడిన తరువాత, ఆ ధృవీకరించబడిన విషయము మీకు తెలియజేయబడుతుంది. అదేవిధంగా ఆన్ లైన్ క్విజ్ కొరకు సిద్దపడుచు, హాజరయ్యే వారు పాటించవలసిన మార్గదర్శకాల ప్రతిని మరియు సిద్దపడడానికి మా అధ్యయన ఆడియో పాఠముల సారాంశాల లింక్ కూడా పంపడం జరుగుతుంది.